దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11.10లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 406 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.81లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 8949 మంది మహమ్మారి నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.42కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,04,781 క్రియాశీల కేసులున్నాయి.

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. గత 24 గంటల వ్యవధిలో 200 కేసులు పెరిగి మొత్తం కేసుల సంఖ్య 1431కు చేరింది. మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా.. దిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి 100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 488 మంది ఒమిక్రాన్‌ నుండి కోలుకున్నారు.