జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వాడే వారిపై మరింత భారం పెరగనుంది. ఇక మీదట కస్టమర్ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం నిర్ణయించగా ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల ఫుడ్ ఆర్డర్లు భారం కానున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు తోసి పుచ్చుతున్నారు.

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి మాత్రం కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించడంతో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు.