ఒమిక్రాన్ వైరస్ ప్రభావం బ్రిటన్, అమెరికాలలో తీవ్ర రూపం దాల్చింది. భారత్ లో కూడా జనవరి తరువాత నుంచి ఈ వైరస్ ప్రభావం చూపనుందని సర్వేల ప్రకారం తెలుస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో ఈ మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. కానీ ఈ వైరస్ ను నియంత్రించడానికి ముందు నుంచి పరిశోధనలు మొదలు పెట్టినా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఈ మహమ్మారి విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ను తుదముట్టించే యాంటీ బాడీస్ ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము ఒమిక్రాన్ పై విస్తృత పరిశోధనలు చేశామనికేవలం ఒమిక్రాన్ పై మాత్రమే కాదు భవిష్యత్తులో ఎలాంటి వైరస్ లు వచ్చినా వాటిపై పోరు చేసే యాంటీబాడీస్ ను తాము గుర్తించామని ప్రకటించారు. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ… స్పైక్ ప్రోటీన్ ఆధారంగా ఈ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించి వేగంగా వ్యాప్తి చెందుతోందని, తాము చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించామని ఒమిక్రాన్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు.

ఈ పరిశోధన పూర్తి వివరాలు నేచర్ జనరల్ లో ప్రచురించారు. గతంలో ఈ వైరస్ సోకి కోలుకున్న వారి యాంటీబాడీస్, అలాగే తరువాత వేరియంట్ సోకి కోలుకున్న వారి యాంటీబాడీస్ తీసుకుని పరిశోధనలు చేశామని, తాజాగా ఒమిక్రాన్ సోకిన వారిపై కూడా పరిశోధనలు చేశామని, ఈ క్రమంలోనే ఒమిక్రాన్ ను ఎదుర్కునే సమర్ధవంతమైన యాంటీబాడీస్ ను తాము గుర్తించినట్టుగా జర్నల్ లో ప్రచురించారు. ఇంకా తాము గుర్తించిన యాంటీబాడీస్ భవిష్యత్తులో రాబోయే వైరస్ లను ఎదుర్కునేలా పనిచేస్తుందని వెల్లడించారు.