కొత్త సంవత్సరాన్ని జనవరి 1న మాత్రమే ఎందుకు జరుపుకోవడం ఎందుకో మీకు తెలుసా?? ఇంతకుముందు నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోలేదనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం 1582 అక్టోబర్ 15న ప్రారంభమైంది. దీనికిముందు ప్రజలు మార్చి 25న అలాగే కొన్నిసార్లు డిసెంబర్ 25న కొత్త సంవత్సరాన్ని జరుపుకునేవారు. రోమ్ కింగ్ నుమా పాంపిలస్ రోమన్ క్యాలెండర్‌ను మార్చిన తర్వాత జనవరిని సంవత్సరంలో మొదటి నెలగా పరిగణించారు. పూర్వం మార్చిని సంవత్సరంలో మొదటి నెలగా పిలిచేవారు. దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మార్చికి మార్స్ గ్రహం పేరు పెట్టారు. రోమ్‌లోని ప్రజలు మార్స్‌ను యుద్ధ దేవతగా భావిస్తారు. మొదటి క్యాలెండర్ సృష్టించిన దానిలో కేవలం 10 నెలలతో మాత్రమే సృష్టించారు. అందుకే సంవత్సరంలో 310 రోజులు, 8 రోజులు ఒక వారంగా పరిగణించేవారు.

రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్‌ను మార్చాడని చెబుతారు. జనవరి 1న కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను మార్చిన తర్వాత సంవత్సరం 12 నెలలకు పొడిగించారు. జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యాక భూమి సూర్యుని చుట్టూ 365 రోజుల ఆరు గంటలలో తిరుగుతుందని కనుగొనబడడంతో అప్పుడు దానిని బట్టి జూలియన్ క్యాలెండర్‌లో సంవత్సరాన్ని 365 రోజులకు సవరించి అప్పటి నుండి 1 జనవరి ను సంవత్సరం మొదటి రోజుగా గుర్తించడం ప్రారంభించారు.