గత కొంతకాలంగా కరోనా కారణంగా కుటుంబాలతో కలిసి ఎలాంటి టూర్ లకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ మీరు మరీ దూర ప్రాంతాలకు కాకుండా ఇండియా లో మాత్రమే ఎక్కడికైనా వెళ్లాలంటే మీకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం ‘గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్’ పేరుతో గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్‌లో పర్యాటకుల్ని హంపి, గోవా లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. తెలుగు రాష్ట్రాల పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. 2022 ఫిబ్రవరి 12న అనకాపల్లి నుంచి ఈ టూరిస్ట్ ట్రైన్ బయల్దేరుతుంది. దారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఫిబ్రవరి 18న ఈ టూర్ ముగుస్తుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ఐఆర్‌సీటీసీ గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్ 2022 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు పర్యాటకులు అనకాపల్లి, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్‌లో రైలు ఎక్కాలి. రెండో రోజు కర్నూలు, గుంతకల్లులో ప్రయాణికులు భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్‌ ఎక్కొచ్చు. రెండో రోజు పర్యాటకులు హోస్‌పేట్ చేసుకుంటారు. అక్కడ హేమకుంట హిల్ ఆలయం, విజయ విఠల, హంపి, శ్రీ విరూపాక్ష ఆలయం సందర్శించొచ్చు. ఆ తర్వాత మడగావ్ బయల్దేరాలి.

మూడోరోజు మడగావ్ చేరుకుంటారు. అక్కడ పర్యాటకులు సొంత ఖర్చులతో డోనా పౌలా మండోవి రివర్ క్రూజ్‌లో ప్రయాణించొచ్చు. రాత్రికి గోవాలో బస చేయాలి. నాలుగో రోజు గోవా సైట్‌సీయింగ్ ఉంటుంది. వగటార్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, క్యాథడ్రాల్ లాంటి ప్రంతాలు చూడొచ్చు. రాత్రికి గోవాలో బస చేయాలి. ఐదో రోజు మంగేష్ ఆలయం, శ్రీ శాంతదుర్గ ఆలయం, కోల్వా బీచ్ సందర్శన ఉంటుంది.

అక్కడ్నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు పర్యాటకులు గుంతకల్ జంక్షన్, కర్నూలు సిటీ, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరు, ఏడో రోజు రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, అనకాపల్లిలో రైలు దిగడంతో టూర్ ముగుస్తుంది.

రూ.11 వేల లోపే 11 రోజుల టూర్… విజయవాడ, విశాఖపట్నం నుంచి గుజరాత్‌కు…
ఐఆర్‌సీటీసీ గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8,090. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, వసతి సౌకర్యాలు, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి.