కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్ స్టిట్యూట్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలు 641 ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదిగా 2021 జనవరి 10 ను నిర్ణయించారు. అప్లై చేయాలనుకునేవారు టెన్త్ క్లాస్ పాసై 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. టిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.iari.res.in/ వెబ్ సైట్ ను చూడండి.