శబరిమల అరవణ ప్రసాదాన్ని బియ్యం, బెల్లం, నెయ్యిలతో తయారు చేస్తారు. డని రుచి ఎంతో బావుంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మంచిది. శరీరంలో వేడి నింపుతుంది. అరవణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్కోర్‌ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. ఇక్కడ ఏటా 80 లక్షల ప్రసాదాలను తయారు చేస్తారు.

తిరుపతి, షిర్డీ క్షేత్రాల తరువాత ఎక్కువమంది భక్తులు దర్శించుకునే ఆలయం శబరిమల. తిరుమల లడ్డూ తరువాత, అయ్యప్ప స్వామి ప్రసాదానికి అంత ప్రాధాన్యత ఉంది. కరోనా కారణంగా శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో తపాలా శాఖ అరవణ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్లికేషన్‌ ఫారంలో పూర్తి పేరు, చిరునామా రాసి పోస్ట్‌ ఆఫీస్‌లో 450 రూపాయలు చెల్లిస్తే శబరిమల కిట్టు మీ ఇంటికే వస్తుంది. ఇందులో అరవణ ప్రసాదం, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, అర్చన ప్రసాదం అన్ని ఉంటాయి.