భాగ్యనగర వాసులకు తెలంగాణ సర్కార్‌ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ మంత్రి కేటీఆర్‌ షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను సిగ్నల్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేక్రమంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ కూడా ఒకటి.

షేక్‌ పేట్‌ ఫ్లై ఓవర్‌ 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్‌లో SRDP ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. ఆరు లేన్లు ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను 333 కోట్ల 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను నూతన సంవత్సర కానుకగా ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. షేక్‌ పేట్ ఫ్లై ఓవర్‌ సెవన్‌ టూంబ్స్‌ జంక్షన్‌, ఫిల్మ్‌ నగర్‌ రోడ్ జంక్షన్‌, ఓయూ కాలనీ జంక్షన్‌, విస్పర్‌ వేలీ జంక్షన్ల మీదుగా వెళుతుంది. దీంతో ఈ రూట్‌లోని ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయి.