టాప్ స్టోరీస్ (Top Stories)

ఆదిత్య 369 అడ్వాన్డ్స్‌ వెర్ష‌న్ చూపిస్తారట‌..!

బ‌హుబ‌లితో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన ప్ర‌భాస్ ఇప్పుడు ఆ ఇమేజ్‌ని కొన‌సాగించాల‌నుకుంటున్నాడు. అందుకే ఇక మీద తీసే సినిమాలు కూడా భిన్నంగా, భారీ రేంజ్‌లో, భారీ బ‌డ్జెట్‌తో ఉండేలా చూసుకుంటున్నాడు. మ‌హాన‌టితో హిట్ అందుకున్న‌ నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ సినిమా భిన్న‌మైన క‌థ‌తో ఉంటుంద‌ని చెబుతున్నారు. పాన్ ఇండియా మూవీగా సుమారు రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో వైజ‌యంతి మూవీస్ వాళ్లు ఈ సినిమాను పెద్ద ఎత్తున తెర‌కెక్కిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే న‌టీన‌టుల‌ను ఎంపిక చేస్తున్నారు. ప్ర‌భాస్‌కు జోడీగా దీపిక ప‌దుకొనే న‌టిస్తుండ‌గా బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. సినిమాకు డీఓపీగా స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ ప‌ని చేస్తున్నాడు. మ్యుజిక్ డైరెక్ట‌ర్‌గా మిక్కీ జే మేయ‌ర్ సెట్ అయ్యాడు. మ‌హాన‌టి సినిమాకు వీరి ప‌నితీరు అద్భుతంగా ఉంది. అందుకే ప్ర‌భాస్ సినిమాలోనూ వీరినే తీసుకున్నాడు నాగ్ అశ్విన్‌. ఈ సినిమా క‌థ గురించి కూడా ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన ఆదిత్య 369 సినిమా త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ట‌.

ఆదిత్య 369లో హీరో గ‌తంలోకి, భ‌విష్య‌త్‌లోకి వెళ్లిన‌ట్లుగానే ఈ సినిమా కూడా భ‌విష్య‌త్‌కు సంబంధించిన‌ది అని చెబుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా ఈ విష‌యంపై కొంత హింట్ ఇచ్చాడు. మ‌హాన‌టితో తాము గ‌తాన్ని చూపించామ‌ని, ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాతో భ‌విష్య‌త్‌ను చూపించ‌బోతున్నామ‌ని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఆదిత్య 369 సినిమా ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావును ఈ చిత్రానికి మెంటార్‌గా పెట్టుకున్నారు. కాబ‌ట్టి, ఆదిత్య 369కి అడ్వాన్డ్స్ వ‌ర్ష‌న్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని టాక్‌.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.