విరాట్ కోహ్లీ, అనుష్ శర్మ దంపతుల కూతురు తొలి ఫోటో బయటకు వచ్చింది. కోహ్లీ, అనుష్క తమ కూతురితో కలిసి దిగిన ఫోటోను అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. అంతే కాదు తమ కూతురికి వామికా అని పేరు పెట్టినట్లు కూడా అనుష్క చెప్పింది. దీంతో వామికా అంటే అర్థం ఏంటనేది నెటిజన్లు గూగుల్లో వెతకడం ప్రారంభించారు. వామికా అంటే దుర్గామాత మరో పేరు. మొత్తానికి తమ కూతురికి చాలా పవర్ఫుల్ పేరు పెట్టారు విరుష్క.