గత కొంత కాలంగా బర్డ్‌ఫ్లూ భయంతో తెలంగాణా లో కుదేలయిన చికెన్ అమ్మకాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. రెండు మూడు వారాల క్రితం వరకు చికెన్ కొనుగోలు చేసేవారు తగ్గిపోవడంతో ఒక దశలో కిలో చికెన్‌ధర 80 నుంచి 90 రూపాయల దాకా తగ్గిపోయింది.ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో తెలంగాణలో ప్రజలకు భయం పోయి గత రెండు వారాల నుండి కిలో చికెన్ ధర 140 నుంచి 150రూపాయల వరకు పెరిగింది.మరలా ఈ వారం రోజుల నుండి మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో రిటైల్ వ్యాపారులు కిలో చికెన్ 190 రూపాయలకు విక్రయించారు. అలాగే వినియోగం కూడా బాగా పెరిగిందని వ్యాపారులు తెలిపారు. రెండు వారాల క్రితం వరకు హైదరాబాద్ లో రోజుకు 2 నుంచి 3 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరగ్గా ఇప్పటికి మాత్రం 6 లక్షల కేజీలకు చేరిందని వ్యాపారాలు తెలిపారు.