హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన పుట్టినరోజు వేడుక కారణంగా 22 మంది కరోనాకు గురయ్యారు. సెక్టార్ 67లోని ఐరియో విక్టరీ వ్యాలీలో ఉన్న ఓ హౌసింగ్‌ సొసైటీలో ఫిబ్రవరి 7న జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక కారణంగా జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ కార్యక్రమం జరిగిన చుట్టుపక్కల ఉన్న 2000 మంది శాంపిళ్లను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే 500 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపినట్టు స్థానిక వైద్యశాఖాధికారులు చెప్పారు. అందులో మొత్తం 30 టవర్లు ఉన్న కాలనీలో నాలుగు టవర్లను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం 270 యాక్టివ్‌ కేసులు ఉన్న కారణంగా ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని అన్ని నివారణ చర్యలు ఖశ్చితంగా పాటించాలని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వీరేంద్ర యాదవ్‌ పిలుపునిచ్చారు.