దేశంలో చమురు ధరలు రోజు రోజుకు పెరగడమే కానీ తగ్గడం అనేది స్వప్నసదృశ్యంగా మారింది.వంట గ్యాస్ తో పాటు వాణిజ్య సిలిండర్‌పైనా ధరలు పెంచి మరోసారి గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు కంగారు పెట్టాయి.

వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను పెంచి, ఆ ధరలు ఇవాళ నుండే అమల్లోకి వస్తాయని సోమవారం వెల్లడించాయి. వంట గ్యాస్ పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ.225 పెంచగా, డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచగా, ఫిబ్రవరి 4న మరోసారి రూ.644 నుంచి రూ.719కి పెంచుతూ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఐదు రోజుల తేడాలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్‌పై రూ.25 పెంచారు. దీంతో సిలిండర్‌ ధర రూ.769కి చేరింది.
వాణిజ్య సిలిండర్‌పైనా రూ.95 పెరగగా, ఒక్కొక్క సిలిండర్ ధరా రూ.1,614కు చేరింది. ఫిబ్రవరి నెలలో 16 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.