టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆ రెండు బ్యాంకుల కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లు పొందండి…

రెండు బ్యాంకులకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారాయి. మీరు పాత కోడ్ ఉపయోగించి ఇతరులకు డబ్బు పంపాలని చూస్తే కుదరకపోవచ్చు. అందుకే ఆ వివరాలు మీకోసం..
విజయా బ్యాంకు, దేనా బ్యాంకు లో అకౌంట్ కలిగినవారికి మార్చ్ 1 నుండి విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు నేటి నుంచి పని చేయవు. బ్యాంక్ ఆఫ్ బరోడా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.ఈ రెండు బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారు 1800 258 1700 నెంబర్ కు కాల్ చేసి కొత్త కోడ్ ను పొందవచ్చు.లేదంటే దగ్గరలోని బ్రాంచ్ లో సంప్రదించి తెలుసుకోవచ్చు, లేదంటే ఎంఐజీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ చివరి 4 అంకెలు టైప్ చేసి 8422009988కు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఎంటర్ చేస్తే ఆన్‌లైన్‌లో ఇతరులకు డబ్బులు పంపడం కుదరదు కాబట్టి తెలుసుకున్నాకే ఎవరికైనా నగదు బదిలీ చేయండి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.