ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన 11 చోట్ల రీ నామినేషన్‌కి అవకాశం‌ కల్పించారు. దానికి కారణం నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందు వల్లనే రీ నామినేషన్ కి అవకాశం ఇస్తున్నట్టుగా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఈనేపథ్యంలో పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందని తెలియపరిచారు.