మైనర్ బాలికను ఆకర్షించి మాయమాటలతో మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగి మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఆటను బెయిల్ కోసం హైకోర్టు ను ఆశ్రయించగా అతనికి బెయిల్ మంజూరు కాలేదు. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీ టెక్నీషియన్ మోహిత్ సుభాష్ చవాన్‌. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించగా సుప్రీమ్ కోర్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి నిందితుడికి ఒక అవకాశం ఇచ్చింది. బాధితురాలిని వివాహం చేసుకుంటే మేము సహాయం చేస్తామని, లేదంటే ఉద్యోగం పోగొట్టుకుని జైలు కు వెళ్తావని, బాలికను ఆకర్షించి అత్యాచారానికి పాల్పడడం తప్పనినిందితుడి తరపున హాజరయిన లాయర్ తో ధర్మాసనం చెప్పింది.

అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కోరినా కానీ అందుకు ఆ బాలిక నిరాకరించడం గమనార్హం. ఆ బాలికకు 18 ఏళ్ళు నిండిన తరువాత వివాహం చేసుకుంటానని ఆ వ్యక్తి లిఖితపూర్వకంగా రాసిచ్చిన కూడా ఆబాలిక నిరాకరించడంతో అతను కూడా వివాహానికి నిరాకరించారు. దానితో అతనిపై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. అని లాయర్ పిటిషన్ వేశారు.మీరు ఆమెను వివాహం చేసుకుంటారా అని జస్టిస్ బాబ్డే ప్రశ్నించగా చవాన్ లాయర్ సూచనలు తీసుకుంటామని తెలిపారు. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని మీకు తెలుసు కదా అని చీఫ్ జస్టిస్ అడగగా ‘‘నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఒక వేళ అరెస్టయితే అటోమేటిక్‌గా విధుల నుంచి సస్పెండ్ అవుతాను’ అని అన్నారు.

వాస్తవానికి నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న కూడా ఆమె నిరాకరించిన కారణంగా చేసుకోలేదు, ఇప్పుడు నాకు వివాహమైంది కాబట్టి చేసుకోలేదు అని చవాన్ తెలియచేసారు. విచారణ కొనసాగుతోందని, ఛార్జ్‌షీట్ ఇంకా దాఖలు చేయలేదని తెలుపగా ధర్మాసనం జోక్యం చేసుకుని ‘అందుకే మేము మీకు ఈ అవకాశం ఇచ్చాము అరెస్టుపై నాలుగు వారాల పాటు స్టే విధిస్తాం అప్పుడు మీరు సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని తెలిపింది. ట్రయల్ కోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీచేయగా.. హైకోర్టు దానిని రద్దుచేసింది. తాజాగా, సుప్రీంకోర్టు అతడికి ఊరట కలిగించింది. నాలుగు వారాల పాటు అరెస్ట్ కూడా చేయవద్దని పోలీసులను ఆదేశించింది.