సోమవారం నుండే రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడినవారికి, 45-59 ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సుమారు 50 లక్షల మందికి కరోనా టీకా వేయనున్నారు.
దాదాపు 1,500 కేంద్రాల్లో టీకా వేయాలని నిర్ణయించినా తొలిరోజు టీకాలు మాత్రం కొన్ని పరిమిత కేంద్రాల్లో వేయనున్నట్టు నిర్ణయించారు. తొలిరోజు ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో 1,500 కేంద్రాల్లో అనుకున్నది కాస్తా 93 కు కుదించారు.ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రం తొలివారం అనుమతించగా , తరువాత కొనసాగే విధానాన్ని బట్టి నేరుగా కేంద్రానికి వచ్చేవారికి కూడా టీకా వేసే ఉద్దేశ్యం లో ఉన్నామని ఆరోగ్య శాఖా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 1 న 48 ప్రభుత్వ, 45 ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాలు వేస్తారు.రోజుకు ప్రతి ఒక్క కేంద్రంలోను గరిష్టం గా 200 మందికి ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా ఉచితంగా అందించనున్నారు, కానీ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక డోస్ ఖరీదు రూ.150.. సేవా రుసుం గరిష్ఠంగా రూ.100 వరకూ వసూలు చేసుకోవచ్చు. దానికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా వసూల్లు చేయడానికి వీల్లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు సేవ రుసుము ను పూర్తిగా రద్దు చేసి కూడా టీకాలు ఇవ్వచ్చు , లేదా కొంత మేరకు తగ్గించి వసూలు చేస్కోవచ్చు.తొలిరోజు అనగా మార్చ్ 1 న కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది.మిగిలిన రోజుల్లో ఉదయం 9 గంటలకే మొదలయి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది అని వివరించారు. కొవిన్‌ 2.0 యాప్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ నమోదు చేసుకున్నవారికి కూడా వారు కోరుకున్న కేంద్రంలో టీకాలు వేస్తామన్నారు. కోఠిలో ఆరోగ్య కార్యాలయంలో డీఎంఈలు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ వివరించారు.

ప్రస్తుతం ప్రధాన నగరాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలలో మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇది కనీసం 5 నుండి 6 నెలలు కొనసాగుతుంది కావున తమకు లభించదేమో అనే ఆందోళనని, ప్రజలందరూ పక్కన పెట్టాలని స్పష్టం చేసారు.
60 ఏళ్లు దాటిన వారు ఎవరైనా సరే ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, పాస్‌పోర్టు లాంటి గుర్తింపు కార్డు ను జత చేయాలి. 45-59 ఏళ్ల మధ్యవయస్కులు ఏదయినా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా వైద్యుడు ఇచ్చిన ధ్రువపత్రాన్ని జత‌ చేయాలి. టీకా పొందేటప్పుడు సంబంధిత ధ్రువ పత్రాల ఒరిజనల్స్‌ను వారి వెంట ఉంచుకోవాలి.

తొలిరోజే సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులకు కూడా టీకాలు వేయడం ద్వారా ప్రజలలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాము.టీకా వేసిన తర్వాత ఏదయినా అసౌకర్యానికి లోనయితే 104 నెంబర్ కు ఫోన్ చేసి వైద్య సహాయం తీసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వారంలో ఎన్ని రోజులు టీకా వేయాలనే నిబంధన ఏమి లేదు, ఆయా ఆస్పత్రి యాజమాన్యాలను అనుసరించి ఉంటాయి కానీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం బుధ, ఆదివారాలు మినహా అన్ని రోజుల్లోనూ టీకాలను వేస్తారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే టీకాలను వేస్తారని, ప్రైవేట్ టీకాలను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఈ సందర్భం గా తెలియచేసారు. ఒకసారి యాప్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్ల్ ఫోన్ కే అన్ని వివరాలు (సమయం, తేదీ, కేంద్రం వివరాలు) తెలియచేస్తూ స్‌ఎంఎస్‌ వస్తుంది. మొదటి డోస్ సమయంలోనే రెండవ డోస్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియచేస్తారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత కొవిడ్‌ టీకా పొందినట్లుగా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది’’ అని తెలియచేసారు.

ప్రాంతాలవారీగా కేంద్రాలు తెలుసుకోవడానికి పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి.