బరంపురం కలెక్టర్ విజయ్ భయంకరమయిన ఎయిడ్స్ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులను వివాహ బంధంతో ఒకటి చేసారు. సమాజం తిరస్కరణకు గురయిన ఈ ఇద్దరు అన్నిటిని ఎదుర్కొని వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్పూర్లోని శ్రాద్ధ సంజీవని హెచ్ఐవీ సేవాశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగం ప్రాజెక్ట్ చైర్మన్ సింధ్ దత్తాత్రేయ బహుసాహిబ్, బరంపురం మున్సిపాల్ కమిషనర్ శిద్ధేశ్వర్ బలిరామ్ బందరా, సబ్ కలెక్టర్ కీర్తి హాసన్ పాల్గొన్నారు. పలువురు వీడియో కాన్ఫెరెన్సులో వీరిని ఆశీర్వదించి అభినందించారు.