భవనంలో చూస్తుండగానే మంటలు చుట్టుముట్టి పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దానితో ఆ భవనంలో ఉన్న మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో తల్లి ఆమె నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి ఇంటి ద్వారం ముందు అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. తప్పించుకోవడనికి ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ తల్లి చివరికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వారిని మూడవ అంతస్తు కిటికీ నుండి కిందకు విసిరేయగా ఆ భవనం కింద ఉన్న కొంతమంది వాలంటీర్లు బ్లాంకెట్ లతో పిల్లల్ని పట్టుకున్నారు.ఈ సంఘటన ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకుంది. పిల్లలు సురక్షితంగా ఉండడంతో ఆ తల్లి ఊరట చెందింది. ఈలోపు మంటలు, పొగ వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి భవనంలో మంటలు ఆపేసారు. ఆ తల్లి, పిల్లలందరూ సుర‌క్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ భవనంలోని వారెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.