ఎట్టకేలకు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యకేసులో ఉపయోగించిన హత్యాయుధం దొరికింది. పార్వతి బ్యారేజీలో 53వ నంబర్‌ పిల్లర్‌ వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి దొరికింది. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించి నిందితులను నిన్న పార్వతి బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు గాలించినప్పటికీ ఏమి లభ్యం కాకపోవడంతో ఇవాళ మళ్ళీ గాలింపు కొనసాగించారు.ఈ సారి పెద్దవయిన అయస్కాంతాలు ఉపయోగించి కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నంబర్‌ పిల్లర్‌ వైపు గాలించగా చివరికి అక్కడ ఒక కత్తి లభ్యమైంది. మరొక కత్తి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది.