ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రధానం మంత్రినరేంద్ర మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా నివారణ కోసం డాక్టర్లు, శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిదని వారిని అందరిని పేరు పేరున ప్రశంసిస్తున్నట్టు చెప్పారు. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులైన అందరు వచ్చి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలను కోరారు.