శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి వద్ద ఆదివారం రాత్రి ట్రాక్టర్‌ టైరుకు గాలి అధికంగా నింపడం వల్ల పేలిపోయి ఇద్దరు మరణం పాలయ్యారు. తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్‌ వద్దకొచ్చారు. టైర్‌కు పంక్చర్‌ వేసి గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలి సూర్యనారాయణ టైర్‌ డిస్‌్కతో పాటు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్‌ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందగా, గోవిందరావు గాయపడ్డారు. గాయపడిన 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.