బోధన్ నకిలీ పాస్ పోర్ట్ ల వ్యవహారం అందరికి తెలిసిందే! మన దేశానికి అక్రమంగా వచ్చిన బంగ్లా దేశీయులు తప్పుడు చిరునామాలతో పాస్స్పోర్టులు పండడాన్ని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సెరిమోసగా తీసుకున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 72 నకిలీ పాస్పోర్ట్ లను నకిలీవని తేల్చారు.


ఈ కేసులో పాస్పోర్ట్ క్లియరెన్స్ కు స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) పోలీసులు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది కాని ఇంట తక్కువ మొత్తం కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక రాజకీయ నేతల హస్తం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి కేసులలో కొందరు రాజకీయ నాయకులపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి.అందుకే ఇప్పటి వ్యవహారంలో కూడా రాజకీయ నాయకుల హస్తం ఉందేమో అని ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేం పాస్‌పోర్ట్‌ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి జారీ అయి అప్పట్లో ఆ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆకేసులో అబూసలేంకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.


ఇక ఇప్పటి కేసులో అయితే నిందితులు సగానికి పైగా విదేశీయులు. అది కూడా అక్రమంగా దేశం లోకి ప్రవేశించారు. వీరందరిపై ఐపీసీ 420, 468, 471(ఫోర్జరీ), సెక్షన్‌ 14 ఫారినర్స్‌ యాక్ట్‌ 1946 (నకిలీ పత్రాలతో దొంగపాస్‌పోర్టులు పొందడం) ప్రకారం వీరికి ఏడేళ్ల కంటే అధికంగానే జైలు శిక్ష పడుతుందని అధికార వర్గాల సమాచారం. ఈ కేసులో ఎస్బీ పోలీసుల తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే విచారణ సమయంలో కనీస నిబంధనలు అన్ని గాలికి వదిలేయడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీసులు పట్టుకున్న బంగ్లాదేశీయుల్లో కొందరికి భారత్‌లో నేరచరిత్ర ఉంది.పాస్‌పోర్టు విచారణ సమయంలో దరఖాస్తుదారుల వేలిముద్రలు తీసుకున్నప్పుడు పాపిలాన్‌’ అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌లో పోల్చి చూస్తే దేశంలో ఏమూల నేర చరిత్ర ఉన్న 10 సెకండ్లలో తెలిసిపోతుంది.అలాంటిది నేరస్తుల్ని తెలిసి ఆ విషయాన్ని దాచిపెట్టి పాస్ పోర్ట్ పొందడానికి సహకరించారంటే తెరవెనక రాజకీయ నాయకులు ఉండే ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి.