ఖమ్మం జిల్లాలో లక్షమందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏప్రిల్ 9 న పార్టీ పేరు ప్రకటించాలని నిర్ణయించారు.ఇప్పటికే ఖమ్మం నేతలతో చర్చించిన అనంతరం ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.మే 14 నుండి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారని తెలిసింది.
జులై 8 వ తేదీన పార్టీ ప్రారంభిస్తానని అనుకున్న ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తేదీల మార్పు విషయంలో షర్మిల అనుచరులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏప్రిల్ 9న ఖ‌మ్మంలో చివ‌రి ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వహిస్తారు. ఆరోజే పార్టీ పేరును కూడా సభ వేదికగా ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మే 14 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటుకు వాడుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఎండల వేడిలో సభ పెట్టలేమని నిర్ణయించుకున్నారు. ఆరోజే పార్టీ వ్యవహారాలను కూడా ప్రారంబించాలనుకుంటున్నారు.
ఈ తరుణంలో షర్మిలఫై వివిధ పార్టీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తుంటే అనుచరులు కౌంటర్ చేయడం మొదలు పెట్టారు.ఇక మంగళవారం వైఎస్ ష‌ర్మిల మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అభిమానుల‌తో స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తారు. 700 మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతి పాటు 5 వేల మంది వరకు వస్తారని ఆమె అభిమానులు చెప్తున్నారు. జిల్లాలో ఉన్న సమస్యలపై మంగళవారం షర్మిల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారని ఆమె అనుచరులు చెప్తున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడవలసిందే!