గుంటూరు-విశాఖపట్టణం రైలు ప్రయాణికులలో సింహాద్రి ఎక్స్ప్రెస్ అంటే తెలియని వారు ఉండరని అంటే అతిశయోక్తి కాదు! అయితే కరోనా నేపథ్యంలో చాలా రైళ్ల లాగే ఈ రైలు కూడా రద్దు చేసారు. ఇప్పుడు సింహాద్రి ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా నడపనున్నారు. దీనితోపాటు పల్నాడు ఎక్స్ప్రెస్, డెల్టా ఎక్స్ప్రెస్ను కూడా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా నడపనున్నారు.
గుంటూరు-విశాఖపట్టణం-గంటూరు మధ్య గతంలో నడిచిన ఈ రైలు(07239) ఏప్రిల్ 2న గుంటూరులో 8 గంటలకు బయలుదేరి నంబూరు 08.14, మంగళగిరి 08.26, విజయవాడ 08.55, విశాఖపట్టణం 16.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07240) ఏప్రిల్ 3న విశాఖపట్టణంలో 07.10 గంటలకు ప్రారంభమై విజయవాడ 13.50, మంగళగిరి 14.12, నంబూరు 14.21, గుంటూరు 15.20 గంటలకు చేరుతుంది.
గుంటూరు-వికారాబాద్ -గుంటూరు మధ్య గతంలో నడిచిన పల్నాడు ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా ప్రారంభిస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ పొందిన ఈ రైలు(02747) గురువారం గుంటూరులో 05.45 గంటలకు బయలుదేరి సత్తెనపల్లి 06.23, పిడుగురాళ్ల 06.48, నడికూడి 07.09, విష్ణుపురం 07.26, సికింద్రాబాద్ 10.35, వికారాబాద్ 12.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(02748) అదేరోజు వికారాబాద్లో 14.40 గంటలకు ప్రారంభమై, సికింద్రాబాద్ 15.55, నడికూడి 18.31, పిడుగురాళ్ల 18.51, సత్తెనపల్లి 19.19, గుంటూరు 21.00 గంటలకు రానుంది.
ఏప్రిల్ ఒకటి నుంచి గతంలో కాచిగూడ-రేపల్లె-కాచిగూడ మధ్య నడిచిన డెల్టా ఎక్స్ప్రెస్ను కూడా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలుగా నడపనున్నారు. ఈ రైలు(07625) కాచిగూడలో 22.10 గంటలకు బయలుదేరి గుంటూరు 03.20, తెనాలి 04.00, రేపల్లె 05.50 గంటలకు చేరుతుంది. ఏప్రిల్ 2న ఈ రైలు(07626) రేపల్లెలో 22.40 గంటలకు బయలుదేరి తెనాలి 23.20, గుంటూరు 23.20, కాచిగూడ 07.05 గంటలకు చేరుతుందని రైల్వే శాఖ వారు తెలిపారు.