రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌ 7 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయన్న సంగతి పాఠకులకు తెలిసిందే! అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉంది.

ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్‌ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్‌ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇంటర్‌ పరీక్షలు, జేఈఈ మెయిన్‌ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్‌ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నాయాలను పేర్కొన్నట్లు , ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్‌ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్‌ పరీక్షలు లేకుండా మార్కులు వేయడం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ప్రాక్టికల్‌ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రాక్టికల్‌ ఏప్రిల్‌ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు కాబట్టి ప్రాక్టికల్స్‌ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్నల్‌ అసైన్‌మెంట్స్‌ ఇచ్చి వాటినే ప్రాక్టికల్‌ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది.