జగిత్యాల జిల్లా సిరిపూర్‌లో కే కుటుంబానికి చెందిన 27 మందికి కొవిడ్‌ సోకడం స్థానికంగా కలకలం రేపింది. బంధువు దశ దిన కర్మకు ఇటీవల మొత్తం 37 మంది కుటుంబ సభ్యులు హాజరైన తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 27 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. తాజా కేసులతో సిరిపూర్‌లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు.