వేసవి కాలం మొదలైన దగ్గర నుండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాము కానీ ఏకంగా భారీగా విస్ఫోటనం జరగడం కొంచం ఆలోచించవలసిన విషయం. తాజాగా స్కాట్‌లాండ్‌లో గ్లాస్‌గావ్‌లో నివసిస్తున్న లౌరా బిర్రెల్ అనే మహిళ ఇంట్లో పెద్ద విస్ఫోటనం జరిగేసరికి తన ఇంట్లో బాంబు పేలిందేమోనని హడలిపోయింది.

తీరా వంటగదిలోకి వెళ్లి చూసేసరికి వాషింగ్ మెషీన్ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురై కనిపించింది. వాషింగ్ మెషీన్‌లో దుస్తులు వేసి వేరే పనిలో నిమగ్నమై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పేలుడు తర్వాత ఇల్లంతా పొగతో నిండిపోయిందని, అద్దాలు, ప్లాస్టిక్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉండగా ఆ సమయంలో తాను అక్కడే ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనంటూ ఆమె భయాందోళనలు వ్యక్తం చేసింది.