నష్టాల్లో ఉన్న కారణంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నామని, విశాఖ ఉక్కు వల్ల ఆర్ధిక భారం పెరిగిపోతుందని రకరకాల కారణాలు చూపించే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లాభాలలో నడుస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆశిస్తూ … విశాఖ టర్నోవర్ వివరాలు చూద్దాం.

సీఎండీ పీకే రథ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18వేలకోట్ల టర్నోవర్‌ నమోదు చేసినట్లు, ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే రెండో అత్యధికమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన తరుణంలో విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్‌ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. ఈ 4 నెలల్లో రూ.740కోట్ల నికర లాభం నమోదైందని, మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ.3,300కోట్లకు విక్రయించామనీ, కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు, సిబ్బంది, అధికారులకు సీఎండీ అభినందనలు కూడా తెలిపారు.