బ్రిటన్‌లో పోలీసులు ఆల్కహాల్ తాగితే అధికారులను అప్రమత్తం చేసే సరికొత్త ట్యాగ్‌లు
వాడటం మొదలుపెట్టారు. వీటిని ”సొబ్రైటీ ట్యాగ్స్”గా అని పిలుస్తారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆల్కహాల్ తాగేవారిని ఇవి అధికారులకు పట్టిస్తున్నాయి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెమటలోని ఆల్కహాల్ స్థాయిని పరీక్షించి ఆల్కహాల్ జాడ కనిపిస్తే, వెంటనే ఇవి అధికారులకు సమాచారం అందిస్తాయి.

కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండడంతో వారిని బ్రిటన్ కోర్టులు ఆల్కహాల్ తీసుకోకూడదని సూచించి మళ్లీ వారు ఆల్కహాల్ తీసుకుంటూ పట్టుబడితే, వారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తారు. తాజాగా ఈ ట్యాగ్‌లను ఇంగ్లండ్ వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు.

”ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నేరాలకు పాల్పడే అలవాటు ఉన్నవారిని అడ్డుకోవడంలో ఈ ట్యాగ్‌లు చక్కగా పనిచేస్తాయని, నేరస్థులు ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకూ ఇవి తోడ్పడతాయి”అని పోలీసింగ్, నేరాల శాఖా మంత్రి కిట్ మాల్ట్‌హౌస్ చెప్పారు. కేవలం 18 ఏళ్లకుపైబడిన, ఆల్కహాల్‌కు బానిసలైన నేరస్థులకు మాత్రమే ఈ ట్యాగ్‌లు వేస్తారు. శానిటైజర్లు, పెర్ఫ్యూమ్‌లు, ఆల్కహాల్‌ల మధ్య భేదాన్ని ఈ ట్యాగ్‌లు చక్కగా కనిపెట్టగలవని అధికారులు చెబుతున్నారు.