కరోనా నియంత్రణలో భాగంగా అనేక కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి. వాటి పనితీరుపై రకరకాల ప్రయోగాలు చేసి నిర్దారించుకుంటున్నాయి. వాటిలో ఫైజర్ టీకా కూడా ఒకటి. తాజాగా అమెరికాలో మొత్తం 2260 మంది పిల్లలపై పరీక్షలు జరపగా..టీకా సామర్థ్యం 100 శాతంగా ఉన్నట్టు తేలిందని వెల్లడించాయి. అత్యాధునిక ఎమ్‌ఆర్‌ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా ఫైజర్ టీకా తయారైన విషయం తెలిసిందే. అమెరికాతో పాటూ ఐరోపా సమాఖ్య కూడా 16 ఏళ్లు పైబడి వారిపై దీన్ని ఉపయోగించేందుకు అనుమతించాయి. ఇప్పటి వరకూ 65 దేశాల్లో లక్షల మందికి ఈ టీకా అందింది. ఇక ఇటీవల ఇజ్రాయెల్‌లో 10.2 లక్షల మందిపై జరిగిన ఓ అధ్యయనంలో టీకా ప్రభావశీలత ఏకంగా 95 శాతం ఉన్నట్టు తేలింది.