అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అంతరిక్షంలో అగ్నిప్రమాదం!!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో 45 నిమిషాల పాటు నియంత్రణ కోల్పోయి తర్వాత నాసా నియంత్రణ కేంద్రాల్లో ఉన్న విమాన బృందం కంట్రోల్ థ్రస్టర్ల సాయంతో స్టేషన్‌ను తిరిగి దాని స్థానానికి తరలించింది. రష్యన్ లాబొరేటరీ మాడ్యూల్ నౌకాలో సాంకేతిక లోపం కారణంగా గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మాడ్యూల్‌ నౌకను ఇటీవలనే ఐఎస్‌ఎస్‌కు జోడించగా ఈ మాడ్యూల్‌ జెట్ థ్రస్టర్‌లు ఆటోమేటిక్‌గా ప్రేరేపనకు గురయ్యాయి. ఈ కారణంగా ఐఎస్‌ఎస్‌ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నియంత్రణలో లేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే బోయింగ్ సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్ క్యాప్సూల్ లాంచింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభించడాన్ని నాసా వాయిదా వేసింది. ఇది ఐఎస్‌ఎస్‌తో కనెక్ట్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు దీని లాంచింగ్‌ ఆగస్టు 3 కు వాయిదా వేశారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్ అట్లాస్ V రాకెట్‌పై స్టార్‌లైనర్ ప్రయోగించాల్సి ఉంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఇద్దరు రష్యన్లు, ముగ్గురు అమెరికన్లు, ఒక జపనీస్, ఒక ఫ్రెంచ్ వ్యోమగామి ఉన్నారని నాసా తెలిపింది. 45 నిమిషాలపాటు నియంత్రణలో లేని సమయంలో గ్రౌండ్‌లోని బృందం ఐఎస్‌ఎస్‌ సిబ్బందితో రెండుసార్లు సంబంధాన్ని కోల్పోగా ఎలాంటి ప్రమాదం జరుగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. నౌకా మాడ్యూల్ థ్రస్టర్‌లలో లోపానికి గల కారణం ఏమిటో ఇప్పటివరకు సమాచారం అందలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •