జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పబ్లిక్‌ హాలిడే అయినా జీతం పడుతుంది: ఆర్బీఐ!!

ఇప్పటివరకు ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెసలుబాటు కనిపించింది. సండేలతో పాటు ఇతర పబ్లిక్‌ హాలిడేస్‌లో కూడా బల్క్‌ పేమెంట్‌ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవడంతో ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్‌, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్‌ స్టెప్‌ సర్వీసెస్‌ని నిలిపేస్తూ ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్‌ బ్యాంక్‌ సర్వీసెస్‌ అందిస్తే రూ. 20 ప్లస్‌ జీఎస్‌టీని వసూలు చేయనుంది.
అలాగే పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్‌ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •