అంతర్జాతీయం (International) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వైరల్ అవుతున్న టైం ట్రావెలర్ వీడియో..!!

ఈ ప్రపంచం ఫలానా తేదీన అంతమైపోతుందని ఇప్పటికే చాలామంది సాధారణ వ్యక్తులు చెప్పగా, మన ఇళ్లలో పెద్దవారు కూడా పురాణాలు ప్రపంచం అంతమవుతుందని ముందే చెప్పాయని చెబుతారు. వీరే కాకుండా సైన్స్ ను అమితంగా ప్రేమించే శాస్త్రవేత్తలు కూడా చాలా సందర్భాల్లో ప్రపంచ అంతం గురించి వ్యాఖ్యానించగా ప్రస్తుతం ఎడ్వర్డ్ అనే వ్యక్తి తాను ట్రైం ట్రావెల్ మిషన్ సాయంతో 5000 వ సంవత్సరం వరకూ ముందుకు వెళ్లి చూశానని ప్రపంచం కనిపించలేదని చెప్పాడు. ఒక యూ ట్యూబ్ చానెల్ తో మాట్లాడిన ఎడ్వర్డ్ తాను టైం ట్రావెల్ మిషన్ లో ప్రయాణించానని అది చాలా సీక్రెట్ ఆపరేషన్ అని, తాను భవిష్యత్ లోకి ప్రయాణించి చూసినపుడు చాలా షాకింగ్ విషయాలు కనిపించాయని, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం మొత్తం నీటితో మునిగి పోయి ఉందని చెప్పాడు.

తాను 2004 లో ఒక సీక్రెట్ మిషన్ ద్వారా ఇలా టైమ్ ట్రావెల్ గురించి అధ్యయనం చేస్తూ దానిలో భాగస్వామిగా చేరినట్టు, తాను భవిష్యత్ లోకి వెళ్లినపుడు తాను ఒక చెక్క ప్లాట్ ఫాం మీద నుంచొని ఉన్నానని, ఇది ఏంటో తెలియక ఆశ్చర్యపోయి చూడగా అక్కడ ఉన్న ఇళ్లన్నీ చెక్కతోనే నిర్మితమై ఉన్నాయని అది ప్రఖ్యాత లాస్ ఏంజెల్స్ నగరమని తాను తర్వాత గుర్తించినట్లుఎడ్వర్డ్ వివరించారు. ఇలా ఎడ్వర్డ్ మాత్రమే కాదు ఇది వరకే ఒక వ్యక్తి తాను టైం ట్రావెల్ మిషన్ లో ప్రయాణించానని భవిష్యత్ లో మనుషులకు ఏలియన్స్ కు మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తాను చూశానని చెప్పడం గమనార్హం!
ఎడ్వర్డ్ ఎప్పుడో 2018 సంవత్సరంలో చేసిన ఆ యూట్యూబ్ వీడియో ఇప్పుడు మరలా వైరల్ అవుతూ సంచలనంగా మారడం విశేషం!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •