వార్తలు (News)

భగత్‌ సింగ్‌ ఉరి సన్నివేశం రిహార్సల్‌ లో విషాదం.. 9 ఏళ్ల బాలుడి మరణం!!

ఉత్తరప్రదేశ్‌లోని బుడౌన్‌లోని బాబాత్ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుల జీవితం ఆధారంగా ఒక నాటకం కోసం పాఠశాల విద్యార్థులు రిహార్సల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివమ్‌(9) అనే బాలుడు భగత్‌ సింగ్‌ పాత్రను పోషించాలనుకుని ఆ బాలుడు స్నేహితులతో కలిసి అతని ఇంటి ప్రాంగణంలో రిహార్సల్‌ చేయడం మొదలు పెట్టి నాటకం చివరి సన్నివేశం కోసం శివమ్ ఒక తాడును తీసుకొని ఓ ఉచ్చును రూపొందించాడు.

దాన్ని అతని మెడ చుట్టూ తగిలించుకున్నాడు. కానీ ప్రమాదావశాత్తు అతని పాదాలు స్టూల్‌ నుంచి జారిపోవడంతో ఉరి బిగుసుకుంది. ఆ సమయంలో అతడు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడి స్నేహితులు ఇదంతా యాక్టింగ్‌ అనుకున్నారు. ఇంతలో శరీరంలో కదలికలు లేకపోయే సరికి పిల్లలు భయపడి అరవడంతో స్థానికులు వచ్చి శివమ్‌ను కిందికి దించినప్పటికీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    126
    Shares
  • 126
  •  
  •  
  •  
  •