ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

రక్తంలో ప్లేట్లెట్ సంఖ్యను పెంచాలంటే ఏంచేయాలి??

కరోనా కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు రావడం గుండె జబ్బులు రావటం కిడ్నీ సమస్యలు రావడం వంటివి చాలా ఎక్కువైపోయాయి. వీటితో పాటి రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి హై ఫీవర్ వచ్చినా డెంగ్యూ మలేరియా వంటివి వచ్చినా ముందుగా రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతుంది. ఇలా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా పెంచుకోవటానికి ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవచ్చో వాటి గురించి తెలుసుకుందాం

బొప్పాయి పండు అలాగే బొప్పాయి ఆకు ను తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా ఉంటుంది తగ్గిన వారికి పెరుగుతుంది బొప్పాయి ఆకులను జ్యూస్ గా తయారు చేసి తీసుకోవాలి ఇలా ప్రతి రోజూ తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది.

గోధుమ గడ్డి జ్యూస్ తాగిన ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది గోధుమ గడ్డి జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగండి.

దానిమ్మ పండు గింజలు తిన్న రక్తం వృద్ధి చెందుతుంది అలాగే ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది ఒకవేళ గింజలను తినడం కష్టంగా ఉంటే జ్యూస్ చేసుకుని తాగవచ్చు.

గుమ్మడి కాయను జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు గుమ్మడికాయ మెత్తని పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి దానిలో కొంచెం తేనె కలుపుకుని తాగాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    105
    Shares
  • 105
  •  
  •  
  •  
  •