వార్తలు (News)

ప్రతి ఇంటి తలుపు తట్టనున్న ఆర్టీసీ!!

ఏపీఎస్ ఆర్టీసీ ఇకపై ప్రతి ఇంటి తలుపు తట్టి లాజిస్టిక్ సేవలు అందించనుంది. గతంలో ఏఎన్ఎల్ పార్సిల్ ద్వారా కొరియర్ సర్వీసులు నిర్వహించిన ఆర్టీసీ దాదాపు ఐదేళ్లుగా ఈ సర్వీస్ ను అందించింది. కొరియర్ ద్వారా బుక్ చేసుకున్న పార్శిల్ ను ప్రైవేటు సంస్థల కంటే ముందే వినియోగదారులకు అందించడంతో పాటు సురక్షితంగా కూడా సరఫరా చేస్తోంది. దీంతో ఆర్టీసీ కొరియర్ సర్వీసుకు డిమాండ్ కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం బస్టాండ్ టూ బస్టాండ్ మాత్రమే సర్వీసు చేస్తున్న ఆర్టీస్ కొరియర్… ఇకపై నేరుగా ఇంటికే లభించనున్నాయి.

ఆర్టీసీ కొరియర్ సర్వీసును మరింత విస్తృతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇకపై వినియోగదారులు బుక్ చేసుకున్న పార్శిల్ ను నేరుగా వారి అడ్రస్ కే అందివ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ అదనపు రుసుం వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుం కేవలం ఆర్టీసీ బస్టాండ్ వరకు మాత్రమే. అయితే ఇంటికి నేరుగా చేరుకోవాలంటే మాత్రం ఇకపై ఒక కేజీ బరువుకు 15 రూపాయలు, ఒకటి నుంచి ఆరు కేజీల బరువున్న వస్తువులకు 25 రూపాయలు, ఆరు నుంచి 10 కేజీల బరువున్న పార్శిల్ కు అయితే 30 రూపాయల రుసుంతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ నేటి నుండి ప్రారంభం అయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •