క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

స్ట్రైక్ లో పాల్గొన్నారని ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు!!

ఆంధ్రప్రదేశ్ గొల్లపూడి లోని ఎస్సెస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సామ్స్) లో క్రమశిక్షణ, విధుల్లో అశ్రద్ద, స్ట్రైక్ లో పాల్గోన్నారని పేర్కోంటూ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

గొల్లపూడి ఎస్సెస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సామ్స్) ఆఫీసులో ఈనెల 27న బోర్డు డైరెక్టర్ తమ తోటి ఉద్యోగిపై చేయిచేసుకున్నారని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహిళలను దుర్భాషలు ఆడుతున్నారని, అధనపు పనిగంటలు పనిచేయాలని నిత్యం వత్తిడి తెస్తున్నారని అప్పట్లో మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ కు, కమీషనర్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేసారు. నిరసన తెలిపిన ఉద్యోగుల్లో కొందరిపై నేడు క్రమశిక్షణపేరుతో ఈ నెల 27నే సస్పెన్షన్ వేటు వేసారు. తనపై దాడిచేశారని పోలీసులకు కంప్లైంట్ చేసిన సూపరెండెంట్ చొక్కం ఎల్లాలుతో పాటు మరో ఇద్దరిపైనా సస్పెషన్ అస్త్రం ప్రయోగించారు. డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు, సూపరెండెంట్ పి చంద్రభూషన్ రావు ల పైనా సస్పెన్షన్ వేటు వేస్తూ నోటీసులు జారీ చేసారు. ఇప్పుడు సర్వత్రా ఈ విషయం చర్చనీయాంశమయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •