క్రైమ్ (Crime) వార్తలు (News)

40 అంతస్తుల టవర్లను కూల్చేయాలి: సుప్రీంకోర్టు!!

యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట భవంతులను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించడంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న జంట టవర్లను మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్‌ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •