వార్తలు (News)

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన !!

తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురుకులాలు మినహా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే జరుగుతుందని ఇంటర్‌ బోర్టు ప్రకటించింది.

పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ పాఠశాలను పరిశీలించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పాఠశాలలను అధికారులు శుభ్రం చేయించారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు నా అభినందనలు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •