వార్తలు (News)

హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ!!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడు నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణతో పాటు మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. హదారులు, వంతెనలపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వీటిపై వెళుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరదలో కొట్టుకుపోయి నలుగురు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. సోమవారం వదర ప్రవాహంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్ బ్రిడ్జి వద్ద బస్సు చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తెచ్చేందుకు యత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం కొనసాగడంతో బస్సు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •