జాతీయం (National) వార్తలు (News)

లాభాలతో తొణికిసలాడుతున్న మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్ బుధవారం ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 209 పాయింట్లు లాభపడి 57,761 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 17,185 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో దాదాపు సగానికిపైగా కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తూ మదుపరులకు ఊరట కలిగించాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటన్‌ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •