అంతర్జాతీయం (International) వార్తలు (News)

టోక్యో ఒలింపిక్స్ లో 10కి చేరిన పథకాల సంఖ్య!!

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంగళవారం మరో మూడు పతకాలు గెలుచుకున్నారు. హై జంప్‌లో రియో ఒలిపింక్స్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు రజత పతకం కైవసం చేసుకోగా, శరద్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. ఇక 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సింగ్‌రాజ్‌ అధాన మరో కాంస్యా చేజిక్కించుకోవడంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 10కి చేరింది. హైజంప్‌ టి63 విభాగంలో మరియప్పన్‌, అమెరికాకు చెందిన శామ్‌ గ్రెవె 1.86 మీటర్ల మార్కును చేరుకున్న తర్వాత బంగారు పతకం కోసం ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా మూడో ప్రయత్నంలో విజయం సాధించి స్వర్ణ పతకం కైెెవసం చేసుకున్నాడు. రియోలో తంగవేలు 1.89 మీటర్లు జంప్‌ చేసి బంగారు పతకం గెలుచుకోగా, ఆ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న వరుణ్‌ భాటి ఈసారి ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.

షూటింగ్‌ విభాగంలో మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సింగ్‌రాజ్‌ అధాన పి1, ఎస్‌హెచ్‌1 విభాగంలో పతకం సాధించాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్‌కు పోలియోబారిన పడి రెండు కాళ్లు చచ్చుబడిపోగా ఇదే అతనికి తొలి పారాలింపిక్స్‌! ఫైనల్‌కు చేరిన 8షూటర్లలో 6గురు షూటర్లు పతకానికి పోటీపడ్డారు. ఈ విభాగంలో భారత్‌కు చెందిన మరో షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ అర్హత రౌండ్‌లో టాప్‌లో నిలిచినా ఆ తర్వాత ఎలిమినేషన్‌ రౌండ్‌లో 575 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. షూటింగ్‌లో ఇంతకుముందు భారత్‌కు చెందిన మహిళా షూటర్‌ అవని లేఖరా 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌-1 విభాగంలో సోమవారం స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. కాంస్య పతకాన్ని సాధించాడు. సింగ్‌రాజ్‌ 216.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •