క్రైమ్ (Crime) వార్తలు (News)

రేపు ఈడీ ఎదుట పూరి జగన్నాథ్‌!!

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు విచారణను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు వేగవంతం చేసి ఇందులో భాగంగా సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మంగళవారం ప్రశ్నించనుంది. ఈ మేరకు పూరి జగన్నాథ్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగనుంది. సినీ రంగానికి చెందిన 12మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన అబ్కారీ శాఖ సిట్ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈడీ అధికారులు మరికొంత మందిని విచారించే అవకాశం ఉంది.

డ్రగ్స్ కేసులో అబ్కారీ శాఖ సిట్ అధికారులు మొత్తం 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తే ఇందులో 12మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు మరో 50మందిని విచారించారు. ఇప్పటి వరకూ 11 నేరాభియోగపత్రాలు దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన మత్తు మందు సరఫరాదారులతో పాటు స్థానికంగా డ్రగ్స్ విక్రయించే వ్యక్తులున్నారు.

12మంది సినీతారల గోళ్లు, తల వెంట్రుకల నమూనాలు సైతం సేకరించిన అబ్కారీ అధికారులు ఎక్కడ కూడా వాళ్ల ప్రస్తావన తేలేదు. ప్రస్తుతం మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి 12మంది సినీరంగానికి చెందిన వాళ్లను సాక్ష్యాలుగానే ప్రశ్నించే అవకాశం ఉంది. మనీలాండరింగ్ జరిగినట్లు తేలితే సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •