అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

నేరాలన్నింటిలోకి స్మగ్లింగ్ నేరం వేరయా!!

విమానాలు ల్యాండవగానే హడావుడిగా ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఒక వ్యక్తి ప్యాంటుపై పసుపు రంగు మరకలు ఉండటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి సదరు ప్యాసింజర్‌ను ఆపి పూర్తిగా చెక్ చేస్తే అతని ప్యాంటుపై మరకలు పెయింట్ కాదని, అది మొత్తం బంగారమని తేలింది. ఆవ్యక్తి ప్యాంటు రెండు పొరలతో ఉంది. బంగారాన్ని పేస్టుగా మార్చి దాని లోపల పొరలపై పైనుంచి కింది వరకూ నింపేసి దానిపై రెండో పొర కప్పి, ఏమీ ఎరగనట్లు ప్యాంటు ధరించాడు.

ఈ వ్యక్తి నుండి 302 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ రూ.14 లక్షల వరకూ ఉంటుందని అంచనా!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •