అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

బ్యాటింగ్‌లో ఘోర పరాజయం పాలైన టీమిండియా!!

ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టులో టీమిండియా అనూహ్యరీతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ టీమ్ఐ దు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. లీడ్స్ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 78 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవగా అనంతరం ఇంగ్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్ 432 పరుగులు చేసింది. 354 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ శుక్రవారం 215/2తో మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ.. శనివారం తొలి సెషన్‌లోనే వరుసగా వికెట్లు చేజార్చుకున్న టీమిండియా ఆఖరికి 278 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్‌లో కీలకమైన శనివారం కేవలం 63 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లనీ టీమిండియా చేజార్చుకుంది. భారత్ జట్టు ఓటమిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ”ఇంగ్లాండ్‌ గడ్డపై బ్యాటింగ్‌లో కుప్పకూలడం జరుగుతూ ఉంటుంది. అయితే లీడ్స్ పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలంగా కనిపించింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ భారత్ బ్యాట్స్‌మెన్ తప్పిదాలు చేసేలా చేయడంతో భారత్ జట్టు బ్యాటింగ్ విభాగం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఇంగ్లాండ్‌కి భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టడం కూడా టీమ్‌పై ఒత్తిడిని పెంచింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ సెప్టెంబరు 2 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •