టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తెలంగాణ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పై బలవంతం లేదు!!

తెలంగాణలో కరోనావైరస్ లాక్‌డౌన్‌ల అనంతరం, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించడంతో ఇరు వాదనల అనంతరం హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు. అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపైనా చర్యలు తీసుకోవద్దు. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు గురుకులాలు, విద్యాసంస్థల వసతి గృహాలను ఇప్పుడే తెరవద్దని, అక్కడ సదుపాయాల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించి తదుపరి విచారణను అక్టోబరు 4కి కోర్టు వాయిదా వేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •