అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

శవాన్ని వేలాడదీసి మరీ తాలిబన్ల విహారం!

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ దురాగతాల పరంపరను కొనసాగిస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగగానే కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకుని ఒక వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి వారు కాందహార్‌లో విహరించారు.

అఫ్గాన్‌ను విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం అక్కడే వదిలేసి వెళ్లడంతో అగ్రరాజ్యానికి చెందిన ఒక హెలికాప్టర్‌లో తాలిబన్లు కాందహార్‌లో విహరిస్తూ ఆ హెలికాప్టర్‌కు ఓ వ్యక్తిని తాడుతో వేలాడదీశారు. అది గాల్లో ఎగురుతుండగా దాని కింద తాడుకు ఓ వ్యక్తి వేలాడటాన్ని పలువురు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వ్యక్తి మృతదేహమేనని, అతడిని చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారని అక్కడి పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్యం దళాలు హడావుడిగా నిష్క్రమించగా అమెరికాకు చెందిన పలు ఆయుధాలు అఫ్గాన్‌లోనే ఉండిపోయాయి. . తాము వెళ్లేముందే ఇక్కడున్న అన్ని ఆయుధాలను నిర్వీర్యం చేశామని దళాలు పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు పేర్కొనగా, అమెరికా హెలికాప్టర్‌లో తాలిబన్లు విహరించడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •