టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics) వార్తలు (News)

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా వదలం: కేంద్రం

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్‌.పి.సింగ్‌ సమాధానమిచ్చారు. ”ప్రభుత్వ పెట్టుబడి ఉపసంహరించాలని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం నిర్ణయించింది. పెట్టుబడి ఉప సంహరణతో నిర్వహణ, సాంకేతికత, సామర్థ్యం పెరుగుతాయి. అధిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగులు, సిబ్బంది, వాటాదారులను పరిగణనలోకి తీసుకున్నాం. అన్నీ పూర్తయ్యాక షేర్‌ పర్చేజ్‌ ఒప్పందం జరుగుతుంది” కేంద్ర మంత్రి స్పష్టం చేయడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •