క్రైమ్ (Crime) వార్తలు (News)

దిశ కేసులో డ్రైవర్‌.. నాకు తెలియదు.. గుర్తులేదు ??

‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ విచారణ కొనసాగుతున్న విషయం పాఠకులకు తెలిసిందే! ఈ విచారణ గురువారం కూడా జరిగింది. నిందితులను చటాన్‌పల్లికి తరలించిన వాహనం డ్రైవర్‌ యాదగిరి(హోంగార్డు)ను కమిషన్‌ విచారించగా పలు ప్రశ్నలకు యాదగిరి నాకు తెలియదు.. గుర్తులేదు అనే సమాధానాలిచ్చారు.

చటాన్‌పల్లి వంతెన వద్దకు నిందితులను వ్యానులో తీసుకెళ్లిన తర్వాత పోలీసులు వారిని తీసుకెళ్లారని, తాను మాత్రం వాహనంలోనే నిద్రపోయానని, శబ్దాలు వినిపించాయని, కానీ అవి ఏ శబ్దాలో మాత్రం గుర్తించలేదని యాదగిరి చెప్పారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలం వైరుద్ధ్యంగా ఉంది కదా అని అడిగితే వాళ్లేం రాసుకున్నారో తనకు తెలియదన్నారు.

ఎన్‌కౌంటర్‌ మృతులకు శవపరీక్ష చేసిన వైద్యనిపుణులను కమిషన్‌ విచారించింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం గాంధీ ఆసుపత్రి ఫొరెన్సిక్‌ నిపుణుడు కృపాల్‌సింగ్‌ శవపరీక్ష నిర్వహించగా న్యాయస్థానం ఆదేశాల అనంతరం దిల్లీ ఎయిమ్స్‌ వైద్యుడు సుధీర్‌గుప్తా రీపోస్ట్‌మార్టం చేయడంతో వారిద్దరిని కమిషన్‌ విచారించింది. పోస్ట్‌మార్టం సందర్భంగా తీసిన స్వాబ్‌(దూది), మృతుల దుస్తులను ఎవరికి అప్పగించారని కృపాల్‌సింగ్‌ను ప్రశ్నిస్తే పోలీసులకు అప్పగించానన్నారు. మృతుల శరీరాలపై ఏం గాయాలున్నాయని ప్రశ్నించగా కేవలం తూటాల గాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గీరుకుపోయిన గాయాలున్నాయని రీపోస్టుమార్టం నివేదికలో ఉంది కదా అని ప్రశ్నించగా ఎన్‌కౌంటర్‌ జరిగిన 17 రోజుల తర్వాత రీపోస్టుమార్టం జరిగింది కాబట్టి ఫ్రీజర్‌లో మృతదేహాలను భద్రపరిచినందున శరీరంపై అలాంటి గీతలు సహజంగా ఉంటాయని బదులిచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •